PM Mudra Loan 2026: చిన్న వ్యాపారాల కోసం రూ. 10 లక్షల ప్రభుత్వ లోన్! ఎలా అప్లై చేయాలో పూర్తి వివరాలు ఇవే!

              మీరు సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా? లేదా ఇప్పటికే ఉన్న మీ వ్యాపారాన్ని మరింత పెద్దదిగా మార్చాలని ప్లాన్ చేస్తున్నారా? పెట్టుబడి కోసం డబ్బు ఇబ్బందిగా ఉంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ముద్ర యోజన (PMMY) ఒక అద్భుతమైన అవకాశం. 




        ఈ పథకం కింద ఎలాంటి గ్యారెంటీ (భరోసా) లేకుండానే చిన్న వ్యాపారస్తులకు, మహిళలకు రూ. 50,000 నుండి రూ. 10 లక్షల వరకు ప్రభుత్వం ముద్ర లోన్స్ అందిస్తోంది.


    1. ముద్ర లోన్ లోని 3 రకాలు (Mudra Loan Categories):వ్యాపార అవసరాలను బట్టి ఈ పథకం కింద లోన్‌ను మూడు భాగాలుగా విభజించారు:

శిశు లోన్ (Shishu Loan): కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికి రూ. 50,000 వరకు ఈ కేటగిరీలో లోన్ ఇస్తారు.

కిషోర్ లోన్ (Kishor Loan): ఇప్పటికే వ్యాపారం ఉండి, దాన్ని కాస్త పెంచాలనుకునే వారికి రూ. 50,000 నుండి రూ. 5 లక్షల వరకు లోన్ లభిస్తుంది.

తరుణ్ లోన్ (Tarun Loan): పెద్ద ఎత్తున వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు ఈ కేటగిరీలో లోన్ ఇస్తారు.

        ముద్ర లోన్ పొందడానికి ఎవరు అర్హులు?భారతదేశ పౌరుడై ఉండి సొంతంగా చిన్న వ్యాపారం చేసుకునే ప్రతి ఒక్కరూ ఈ లోన్ పొందవచ్చు.చిన్న దుకాణదారులు (కిరాణా షాప్, ఫ్యాన్సీ స్టోర్, హోటల్స్ మొదలైనవి).కూరగాయలు, పండ్లు అమ్మేవారు.చిన్న తరహా పరిశ్రమలు, చేతివృత్తుల వారు.స్వయం సహాయక బృందాలు (పొదుపు సంఘాల మహిళలు).


        గమనిక: వ్యవసాయ రంగానికి (పంటలు పండించడానికి) ఈ లోన్ ఇవ్వరు. కానీ డైరీ ఫామ్, కోళ్ల ఫారమ్, తేనెటీగల పెంపకం వంటి అనుబంధ వ్యాపారాలకు ఈ లోన్ తీసుకోవచ్చు.


            కావలసిన ముఖ్యమైన పత్రాలు (Documents Required):గుర్తింపు కార్డు: ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ లేదా డ్రైవింగ్ లైసెన్స్.చిరునామా ఆధారం: నివాస ధృవీకరణ పత్రం లేదా కరెంట్ బిల్లు.వ్యాపార ఆధారాలు: మీ వ్యాపారానికి సంబంధించిన లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేదా షాప్ అడ్రస్ ప్రూఫ్.గత 6 నెలల బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్.పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు.4. ముద్ర లోన్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?మీరు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా ఈ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు:ఆఫ్‌లైన్ పద్ధతి: మీకు దగ్గర్లోని ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ బ్యాంకుకు (SBI, Andhra Pragathi Grameena Bank, Union Bank మొదలైనవి) వెళ్లి ముద్ర లోన్ అప్లికేషన్ ఫారమ్ అడిగి, పూర్తి వివరాలతో డాక్యుమెంట్లు జతచేసి సబ్మిట్ చేయాలి.ఆన్‌లైన్ పద్ధతి: కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ Udyamimitra Portal లేదా జనసమర్థ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది