CIBIL Score Meaning in Telugu: సిబిల్ స్కోర్ అంటే ఏమిటి? ఉచితంగా ఎలా చెక్ చేసుకోవాలి? తక్కువ స్కోర్‌ను పెంచుకునే టాప్ చిట్కాలు ఇవే!

 

 మనం లోన్స్ గురించి విన్నప్పుడు లేదా చర్చించే సమయంలో తరచుగా వినిపించే మాట CIBIL Score 

ఈ CIBIL SCORE గురించి అందరికీ పూర్తిగా అవగాహన ఉండదు. అలాగే చాలా అపోహలు ఉన్నాయి. ఇంకొంత మంది మీ CIBIL స్కోర్ తక్కువ ఉంది అంటే, ఏంటీ అది అని భయపడే వారు ఉన్నారు. పదండి దాని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
















మొదటగా 

1. సిబిల్ స్కోర్ అంటే ఏంటి? {What is CIBIL SCORE?}

•వివరణ: CIBIL అంటే Credit information bureau (India) limited.

 ఇది ఒక వ్యక్తి యొక్క అప్పులు మరియు వాటిని చెల్లించే అలవాట్లను ట్రాక్ చేసే ఒక సంస్థ.

• మీ ఆర్థిక పరమైన క్రమశిక్షణ బట్టి ఈ సంస్థ 300 నుండి 900 మార్కుల మధ్య ఒక స్కోర్ ఇస్తుంది.

 దానినే సిబిల్ స్కోర్ అంటారు.

 

 2. సిబిల్ స్కోర్ రేంజ్ మరియు వాటి అర్థాలు.(CIBIL SCORE ranges and meanings)

సిబిల్ స్కోర్ రేటింగ్ లోన్ వచ్చే అవకాశం
750 - 900 చాలా మంచిది చాలా సులభంగా వస్తుంది
700 - 749 మంచిది త్వరగానే వస్తుంది
650 - 699 సాధారణం బ్యాంకులు ఆలోచించి ఇస్తాయి
300 - 649 చాలా తక్కువ లోన్ రావడం చాలా కష్టం
 

      3. CIBIL స్కోర్ తగ్గడానికి 4ప్రధాన కారణాలు (why CIBIL SCORE drops?)



• ఆలస్యంగా EMI లు చెల్లించడం.

   మనం ఏవైనా వస్తువులు EMI పద్ధతుల్లో తీసుకొని ఉంటాం. నెల నెల కరెక్ట్ గా కట్టకుండా , కట్టే సమయానికి     బ్యాంక్ లో తగినంత డబ్బులు లేకపోవడం అవి చెక్ బౌన్స్ అవ్వడం. దీని వలన స్కోర్ పడిపోతుంది.

• హై క్రెడిట్ యుటిలైజేషన్ (High CUR): 

  మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ లక్ష రూపాయలు ఉంటే, అందులో 30% కంటే ఎక్కువ (30,000 కంటే ఎక్కువ)     వాడేస్తుంటే   స్కోర్ తగ్గుతుంది. 

• ఎక్కువ లోన్ల కోసం వెతకడం (Hard Inquiries): 

  ఒకేసారి చాలా బ్యాంకుల్లో లోన్ కోసం అప్లై చేస్తే, గూగుల్/సిబిల్ మిమ్మల్ని "అప్పుల కోసం ఆకలితో ఉన్న           వ్యక్తిగా" భావించి స్కోర్ తగ్గిస్తుంది.

రాంగ్ ఇన్ఫర్మేషన్ (Errors): 

 కొన్నిసార్లు బ్యాంకుల తప్పు వల్ల మీరు అప్పు కట్టేసినా కట్టలేదని సిబిల్ రిపోర్టులో తప్పుగా చూపిస్తుంది.
 (
మీరు పూర్తి అప్పు కట్టేసిన తరువాత మీరు ఎక్కడ లోన్ తీసుకుంటే అక్కడ తప్పకుండా క్లియరెన్స్ పేపర్స్ తీసుకోవాలి. ఇది తప్పని సరి.)
 

4. తక్కువగా ఉన్న CIBIL స్కోర్ ను ఎలా పెంచుకోవాలి? (How to improve CIBIL SCORE?)


ఆటో-డెబిట్ ఆన్ చేయండి: మీ ఈఎంఐలు మిస్ అవ్వకుండా బ్యాంక్ అకౌంట్‌లో ఆటో-డెబిట్ పెట్టండి.

పాత అప్పులు తీర్చండి: క్రెడిట్ కార్డులపై ఉన్న పాత బాకీలను పూర్తిగా క్లియర్ చేయండి.

క్రెడిట్ మిక్స్ (Credit Mix): కేవలం పర్సనల్ లోన్లు కాకుండా.. సెక్యూర్డ్ లోన్లు (గోల్డ్ లోన్ లేదా బైక్ లోన్) కూడా ఉండేలా చూసుకోండి.


తప్పులను సరిచేసుకోండి: ప్రతి ఏటా సిబిల్ వెబ్‌సైట్ నుండి ఉచిత రిపోర్ట్ డౌన్‌లోడ్ చేసుకుని, అందులో ఏమైనా తప్పులుంటే సిబిల్ అఫీషియల్ సైట్ లో 'Dispute' రైజ్ చేయండి


ఆన్‌లైన్‌లో ఉచితంగా సిబిల్ స్కోర్ ఎలా చెక్ చేసుకోవాలి?

ప్రస్తుతం ఇంటర్నెట్‌లో రూపాయి ఖర్చు లేకుండా కేవలం 1 నిమిషంలో మీ సిబిల్ స్కోర్‌ను ఉచితంగా తెలుసుకోవచ్చు. దీనికోసం కింద ఉన్న ప్రముఖ యాప్స్ లేదా అధికారిక వెబ్‌సైట్లను ఉపయోగించవచ్చు.

గూగుల్ పే (Google Pay): మీ ఫోన్‌లోని గూగుల్ పే యాప్ ఓపెన్ చేసి, కిందికి స్క్రోల్ చేస్తే "Check your CIBIL score for free" అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీ పాన్ కార్డ్ వివరాలు ఇస్తే స్కోర్ వెంటనే చూపిస్తుంది.

పేటిఎం (Paytm): పేటిఎం యాప్‌లో సెర్చ్ బార్‌లో "Free Credit Score" అని టైప్ చేసి మీ పూర్తి పేరు, పాన్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఉచితంగా స్కోర్ తెలుసుకోవచ్చు.

అధికారిక సిబిల్ వెబ్‌సైట్ (Official CIBIL Site): CIBIL Official Website లోకి వెళ్లి "Get your Free CIBIL Score" పై క్లిక్ చేసి, మీ వివరాలు రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ఏడాదికి ఒకసారి ఉచితంగా అధికారిక రిపోర్టును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

వన్ స్కోర్ యాప్ (OneScore App): ఇది కూడా మీ సిబిల్ స్కోర్ మరియు ఎక్స్‌పీరియన్ స్కోర్ రెండింటినీ చాలా స్పష్టంగా చూపిస్తుంది 

ముఖ్యమైన గమనిక: మీ అంతట మీరు ఇలాంటి యాప్స్ ద్వారా స్కోర్ చెక్ చేసుకోవడాన్ని "Soft Inquiry" అంటారు. దీనివల్ల మీ సిబిల్ స్కోర్ అస్సలు తగ్గదు. కాబట్టి మీరు నెలకు ఒకసారి ఎలాంటి భయం లేకుండా మీ స్కోర్‌ను చెక్ చేసుకోవచ్చు.


1. "నాకు అసలు అప్పే లేదు.. అయినా నా సిబిల్ స్కోర్ ఎందుకు చూపించడం లేదు?


" (NH లేదా No History)చాలా మంది జీవితంలో ఎప్పుడూ లోన్ గానీ, క్రెడిట్ కార్డ్ గానీ తీసుకోరు. వాళ్లు స్కోర్ చెక్ చేసినప్పుడు "-1" లేదా "NH" (No History) అని వస్తుంది.
వివరణ: దీని అర్థం వాళ్లకు చెడ్డ స్కోర్ ఉందని కాదు, అసలు వాళ్ల ఆర్థిక చరిత్ర సిబిల్ దగ్గర లేదని అర్థం. ఇలాంటి వాళ్లు స్కోర్ బిల్డ్ చేసుకోవడానికి ఒక చిన్న గోల్డ్ లోన్ లేదా ఎఫ్‌డి (Fixed Deposit) ఆధారిత క్రెడిట్ కార్డ్ వాడటం స్టార్ట్ చేయొచ్చు. (నా సలహా కాదు)


2. క్రెడిట్ కార్డ్ సెటిల్‌మెంట్ (Loan/Credit Card Settlement - డేంజర్ అలెర్ట్!)కొంతమంది అప్పులు కట్టలేక బ్యాంకులతో సెటిల్‌మెంట్ చేసుకుంటారు (ఉదాహరణకు 1 లక్ష బాకీ ఉంటే 40 వేలు కట్టి అకౌంట్ క్లోజ్ చేస్తారు). బ్యాంకులు దాన్ని "Settled" అని సిబిల్‌కి రిపోర్ట్ చేస్తాయి.హెచ్చరిక: మీ రిపోర్టులో 'Settled' అని వస్తే భవిష్యత్తులో 7 సంవత్సరాల వరకు ఏ బ్యాంక్ కూడా లోన్ ఇవ్వదు. కాబట్టి ఎప్పుడూ 'Settlement' చేయకుండా, పూర్తి అప్పు కట్టి "Closed" చేసుకోవడం ఉత్తమం.


3. సిబిల్ స్కోర్ వర్సెస్ ఎక్స్‌పీరియన్ స్కోర్ (CIBIL vs Experian)భారతదేశంలో కేవలం సిబిల్ మాత్రమే కాకుండా Experian, Equifax, CRIF High Mark అనే మరో 3 కంపెనీలు కూడా క్రెడిట్ స్కోర్ ఇస్తాయి, కానీ బ్యాంకులు ఎక్కువగా సిబిల్ (CIBIL) నే నమ్ముతాయి.


ఇంకొక విషయం: ఈ మధ్య పెళ్లి సంబంధాల్లో తల్లిదండ్రులు వరుడి CIBIL స్కోర్ కూడా చెక్ చేస్తున్నారు. దాని బట్టి అబ్బాయి కి ఆర్థిక పరమైన వాటిలో ఎంత క్రమశిక్షణ గా ఉన్నాడు అనేది కూడా వారి ఆలోచన.

  గమనిక   : ఇప్పుడున్న యువతా ఎన్నో ప్రైవేట్ ఆప్స్ లల్లో  2000, 5000 కి ఆశపడి లోన్స్ తీసేస్తున్నారు. ఆ ప్రైవేట్ ఆప్స్ RBI రూల్స్ ki విరుద్ధంగా ఉంటాయి. వాటిని తిరిగి కట్టకపోయినా ఏం కాదు అని వదిలేస్తుంటారు. కానీ అవ్వన్నీ ట్రాక్ అవుతూనే ఉంటాయి. భవిష్యత్తు లో ఇంటికోసమో, కారు కోసమో, భూమి కోసమో లోన్ తీసుకుందాం అనే సమయంలో ఇవ్వన్ని ఇబ్బంది పెడతాయి. సో జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా ఎదగండి. 

 జై హింద్.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది