PM Vishwakarma Yojana Loan 2026: కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ₹3 లక్షల లోన్.. కేవలం 5% వడ్డీకే! అర్హతలు మరియు అప్లై ప్రాసెస్ ఇవే!







PM విశ్వకర్మ యోజన అంటే ఏమిటి?వివరణ: చేతివృత్తులు మరియు సాంప్రదాయ కళలు నమ్ముకుని జీవిస్తున్న వారిని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కారు ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకం ఇది. పేద కష్టజీవులకు ఒక మంచి సువర్ణ అవకాశం.
ఈ పథకం కింద లబ్ధిదారులకు ఉచిత శిక్షణ ఇవ్వడమే కాకుండా, స్వంతంగా వ్యాపారం పెట్టుకోవడానికి ₹3 లక్షల వరకు బ్యాంకు లోన్ అందిస్తారు. శిక్షణ కూడా వారి వారి సొంత జిల్లాల్లో ఒక 15రోజులు వరకు ఉంటుంది. శిక్షణ సమయంలో భోజనం రోజుకు 500రూపాయలు కూడా ఇస్తారు.

ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది?
ఈ కింద పేర్కొన్న 18 రకాల సాంప్రదాయ వృత్తుల వారు దీనికి అర్హులు:దర్జీలు, కుమ్మరులు ,వడ్రంగులు.
కమ్మరులు , స్వర్ణకారులు , శిల్పులు
చెప్పులు కుట్టేవారు , మేస్రీలు , బుట్టలు అల్లేవారు.
రజకులు, మంగళీలు ,చేపల వలలు అల్లేవారు.

లోన్ వివరాలు మరియు తక్కువ వడ్డీ రేట్లు మొదటి విడత : వ్యాపారం ప్రారంభించడానికి మొదట ₹1,000,000 (లక్ష రూపాయలు) లోన్ ఇస్తారు. దీన్ని 18 నెలల్లో తిరిగి చెల్లించాలి.
రెండవ విడత : మొదటి లోన్ సకాలంలో కడితే, అదనంగా ₹2,00,000 (రెండు లక్షల రూపాయలు) లోన్ ఇస్తారు. దీన్ని 30 నెలల్లో కట్టాలి.
వడ్డీ రేటు: మార్కెట్లో పర్సనల్ లోన్ వడ్డీలు 12% పైగా ఉంటే, ఈ పథకంలో కేవలం 5% వడ్డీ మాత్రమే వసూలు చేస్తారు. మిగిలిన వడ్డీని ప్రభుత్వమే సబ్సిడీగా భరిస్తుంది!
ఎలాంటి గ్యారెంటీ అవసరం లేదు : ఈ లోన్ కోసం మీ ఇంటి పత్రాలు గానీ, బంగారం గానీ తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు.




ఈ పథకం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఉచిత టూల్‌కిట్ గ్రాంట్: శిక్షణ పూర్తి చేసుకున్న వారికి పనిముట్లు కొనుక్కోవడానికి ప్రభుత్వం ₹15,000 ఉచితంగా బ్యాంక్ ఖాతాలో వేస్తుంది.
రోజువారీ స్టైఫండ్: ట్రైనింగ్ తీసుకునే రోజుల్లో ప్రతిరోజూ ₹500 చొప్పున ఇస్తారు.
సర్టిఫికేట్: పీఎం విశ్వకర్మ ఐడీ కార్డ్ మరియు అధికారిక సర్టిఫికేట్ ఇస్తారు.




కావలసిన ముఖ్యమైన డాక్యుమెంట్లు ఆధార్ కార్డ్
రేషన్ కార్డ్ / ఆహార భద్రత కార్డు
బ్యాంక్ ఖాతా పుస్తకం
ఫోన్ నెంబర్ (ఆధార్ కి లింక్ అయి ఉండాలి)
కుల ధృవీకరణ పత్రం

PM విశ్వకర్మ లోన్ కి ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి? ఈ పథకానికి నేరుగా లబ్ధిదారులు అప్లై చేయడానికి కుదరదు. మీ గ్రామ/వార్డు సచివాలయం లేదా దగ్గరలోని CSC (Common Service Center) మీసేవ కేంద్రాం కి వెళ్లాలి.
బయోమెట్రిక్ (ఫింగర్ ప్రింట్) వేసి మీ ఆధార్, రేషన్ కార్డ్ వివరాలతో అఫీషియల్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
గ్రామ పంచాయతీ లేదా స్థానిక సంస్థల అధికారులు మీ వివరాలను వెరిఫై చేసి అప్రూవ్ చేసాక లోన్ మంజూరు అవుతుంది.
లోనూ మంజూరు కంటే 15రోజుల పాటు మీ వృత్తి పట్ల శిక్షణ తరగతులు ఉంటాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది