PhonePe ద్వారా అత్యవసర లోన్ 2026: రూ. 5 లక్షల వరకు ఇన్‌స్టంట్ లోన్ ఎలా పొందాలో పూర్తి వివరాలు ఇవే!




            ప్రస్తుత రోజుల్లో ఎప్పుడు ఎలాంటి అత్యవసర పరిస్థితి వస్తుందో చెప్పలేము. వైద్య ఖర్చులు, పిల్లల ఫీజులు లేదా వ్యాపార అవసరాల కోసం అప్పటికప్పుడు డబ్బులు కావాల్సి వస్తే ఎవరినో అడగాల్సిన అవసరం లేదు. మన అందరి మొబైల్స్‌లో ఉండే PhonePe యాప్ ద్వారా చాలా సులభంగా మరియు వేగంగా ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ (Instant Personal Loan) పొందవచ్చు. 

అది ఎలాగా అంటే?

        ఫోన్‌పే. Phonepay నేరుగా మనకు డబ్బులు ఇవ్వదు, కానీ దేశంలోనే ప్రముఖ గుర్తింపు పొందిన లోన్ కంపెనీలతో టైఅప్ అయి మనకు కేవలం 5 నుండి 10 నిమిషాల్లో లోన్ ఇప్పిస్తుంది.
        
              PhonePe లోన్ యొక్క ముఖ్యమైన ఫీచర్లు మరియు లాభాలు:
            భారీ లోన్ మొత్తం: మీ జీతం, ఉద్యోగం మరియు రీపేమెంట్ హిస్టరీని బట్టి కనీసం ₹10,000 నుండి గరిష్టంగా ₹5,00000 (5 లక్షల రూపాయల) వరకు లోన్ పొందవచ్చు.
     
                   తక్కువ డాక్యుమెంట్లు: ఎలాంటి పేపర్ వర్క్ లేదా బ్యాంకుల చుట్టూ తిరిగే పని లేకుండా కేవలం ఆధార్, పాన్ కార్డులతో పూర్తిగా డిజిటల్ పద్ధతిలో లోన్ వస్తుంది.సులువైన ఈఎంఐ (EMI) ఆప్షన్స్: లోన్ డబ్బును తిరిగి చెల్లించడానికి 3 నెలల నుండి 36 నెలల (3 సంవత్సరాలు) వరకు మీ వీలును బట్టి కాలపరిమితిని ఎంచుకోవచ్చు.

         నమ్మకమైన భాగస్వాములు: ఫోన్‌పే మనకు Buddy Loan, MoneyView, CreditMantri మరియు Bajaj Finserv లాంటి ఆర్‌బీఐ (RBI) రిజిస్టర్డ్ కంపెనీల ద్వారా మాత్రమే లోన్ ఇప్పిస్తుంది కాబట్టి ఇది 100% సురక్షితం.
         ఈ లోన్ పొందడానికి ఉండాల్సిన అర్హతలు (Eligibility Criteria):ఫోన్‌పే ద్వారా లోన్ అప్లై చేసే ముందు మీకు కింద ఉన్న అర్హతలు ఉన్నాయో లేదో చూసుకోండి:
దరఖాస్తుదారుడు ఖచ్చితంగా భారతీయ పౌరుడై ఉండాలి.
మీ వయస్సు కనీసం 21 సంవత్సరాల నుండి 58 సంవత్సరాల లోపు ఉండాలి.
మీకు నెలవారీ ఆదాయం ఉండాలి (నెలవారీ జీతం వచ్చేవారు లేదా సొంతంగా వ్యాపారం/స్వయం ఉపాధి చేసుకునేవారు అర్హులు).
మీ సిబిల్ స్కోర్ (CIBIL Score) 700 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే లోన్ రిజెక్ట్ కాకుండా వెంటనే అప్రూవ్ అవుతుంది.
    కావలసిన ముఖ్యమైన పత్రాలు (Documents Required):ఇది ఆన్‌లైన్ లోన్ కాబట్టి కింద ఉన్న డాక్యుమెంట్ల నంబర్లు మీ దగ్గర ఉంటే సరిపోతుంది:

పాన్ కార్డ్ (PAN Card)ఆధార్ కార్డ్ (Aadhar Card) (దీనికి మీ మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి, ఎందుకంటే ఓటీపీ వస్తుంది).
       మీ జీతం పడే బ్యాంక్ ఖాతా వివరాలు మరియు నెట్ బ్యాంకింగ్ లేదా లాస్ట్ 3 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్.ఒక సెల్ఫీ ఫోటో.

        మొబైల్‌లో స్టెప్-బై-స్టెప్ ఎలా అప్లై చేయాలి?

మీ మొబైల్‌లో PhonePe యాప్ ఓపెన్ చేయండి (యాప్ లేకపోతే ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి).హోమ్ స్క్రీన్‌లో కిందికి స్క్రోల్ చేస్తే 'Sponsored Links' లేదా 'Loan' విభాగంలో లోన్ ఇచ్చే కంపెనీల యాప్స్ (ఉదాహరణకు: MoneyView లేదా Buddy Loan) కనిపిస్తాయి.దానిపై క్లిక్ చేసి, మీ మొబైల్ నంబర్ ద్వారా రిజిస్టర్ అవ్వండి.
         ఆ తర్వాత మీ పాన్ కార్డ్ నంబర్, పూర్తి పేరు, మీరు ఉద్యోగమా లేదా బిజినెసా అనే వివరాలు టైప్ చేయండి.మీ వివరాలను బట్టి మీకు ఎంత లోన్ వస్తుందో స్క్రీన్ పై చూపిస్తుంది.మీకు నచ్చిన లోన్ మొత్తాన్ని మరియు నెలవారీ ఈఎంఐ (EMI) ని ఎంచుకుని, ఆధార్ ఓటీపీ ద్వారా ఈ-సైన్ (e-Sign) పూర్తి చేయండి.అంతా పూర్తయిన 5 నిమిషాల్లో డబ్బు నేరుగా మీ ఫోన్‌పే కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చేస్తుంది.
        జనాలు ఎక్కువగా అడిగే సందేహాలు (FAQ - Frequently Asked Questions):ప్రశ్న: ఫోన్‌పే లోన్ పై వడ్డీ రేట్లు ఎంత ఉంటాయి?
    జవాబు: ఇది మీరు ఎంచుకునే లోన్ కంపెనీని బట్టి మారుతుంది. సాధారణంగా వడ్డీ రేట్లు ఏడాదికి 1.33% నుండి ప్రారంభమై మీ రిస్క్ ప్రొఫైల్ బట్టి మారుతుంటాయి.

       లోన్ తీసుకునే ముందే వడ్డీ వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.ప్రశ్న: సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే లోన్ వస్తుందా?జవాబు: సిబిల్ స్కోర్ 650 కంటే తక్కువ ఉంటే లోన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. 
        ఒకవేళ లోన్ వచ్చినా వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా వేస్తారు. కాబట్టి మంచి సిబిల్ స్కోర్ ఉండటం చాలా ముఖ్యం.ప్రశ్న: లోన్ డబ్బులు సకాలంలో కట్టకపోతే ఏమవుతుంది?జవాబు: ఒకవేళ మీరు ఈఎంఐలు సకాలంలో కట్టకపోతే పెనాల్టీ పడుతుంది. అంతేకాకుండా మీ సిబిల్ స్కోర్ పూర్తిగా పడిపోతుంది. దీనివల్ల భవిష్యత్తులో మీకు ఏ బ్యాంకులోనూ లోన్ దొరకదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది