PM Surya Ghar Muft Bijli Yojana 2026: ఇంటిపై సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే ₹78,000 సబ్సిడీ.. ఉచిత విద్యుత్ పథకానికి ఆన్‌లైన్‌లో ఇలా అప్లై చేయండి!


 

ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఇంటా కరెంట్ బిల్లులు విపరీతంగా పెరిగిపోతుండటంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. అలాగే కొన్ని పట్టణాల్లో కరెంట్ కోతలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది . అలాగే పర్యావరణ పరిరక్షణకు వీటి అన్నింటికి  శాశ్వత పరిష్కారం చూపిస్తూ, ప్రజలకు ఉచితంగా విద్యుత్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన  ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పథకాన్ని అమలు చేస్తోంది. అదే PM-Surya Ghar: Muft Bijli Yojana (పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం).

ఈ పథకం కింద మీ ఇంటి పైకప్పు (Rooftop) పై సోలార్ ప్యానెల్స్ అమర్చుకుంటే కేంద్ర ప్రభుత్వం భారీ సబ్సిడీ అందిస్తోంది. అంతేకాకుండా, నెలకు 300 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ వాడుకోవచ్చు. అసలు ఈ పథకం నియమాలు ఏంటి? మన తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీలకు పూర్తి ఉచితంగా ఇస్తున్న అప్‌డేట్ ఏంటి? బ్యాంకు నుండి తక్కువ వడ్డీకే సోలార్ లోన్ ఎలా పొందాలో ఈ ఆర్టికల్‌లో పూర్తి వివరంగా తెలుసుకుందాం.


🔥 ఏపీ వాసులకు బంపర్ ఆఫర్: ఎస్సీ, ఎస్టీలకు 100% ఉచితం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పథకానికి సంబంధించి ఒక అద్భుతమైన మార్పు జరిగింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారి ప్రకటన ప్రకారం... ఏపీలో నివసిస్తున్న 200 యూనిట్ల లోపు కరెంట్ వాడే ఎస్సీ (SC) మరియు ఎస్టీ (ST) కుటుంబాలకు 100% పూర్తి ఉచితంగా (పైసా ఖర్చు లేకుండా) 2 కిలోవాట్ల సోలార్ ప్యానెళ్లను ప్రభుత్వం అమరుస్తోంది.

  • రూ. 1.25 లక్షల సబ్సిడీ: 2 కిలోవాట్ల సోలార్ సిస్టమ్ పెట్టడానికి అయ్యే ఖర్చులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 60,000 సబ్సిడీతో పాటు, మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. కాబట్టి లబ్ధిదారులు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు.
  • బీసీ (BC) కుటుంబాలకు అదనపు రాయితీ: వెనుకబడిన వర్గాల (BC) కుటుంబాలకు కూడా ఏపీ ప్రభుత్వం అదనంగా రూ. 20,000 రాష్ట్ర సబ్సిడీని అందిస్తోంది. కేంద్రం ఇచ్చే రూ. 60,000 మరియు రాష్ట్రం ఇచ్చే రూ. 20,000 కలిపి మొత్తం రూ. 80,000 భారీ సబ్సిడీ లభిస్తుంది. మిగిలిన రూ. 20,000 మాత్రమే కస్టమర్ భరించాల్సి ఉంటుంది.

💡 సాధారణ వర్గాలకు (OC) లభించే సబ్సిడీ వివరాలు:

మిగిలిన సాధారణ వర్గాల ప్రజలకు వారి ఇంటి అవసరాలను బట్టి ఎన్ని కిలోవాట్ల (kW) సోలార్ సిస్టమ్ పెట్టుకుంటున్నారనే దాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది:

  • 1 కిలోవాట్ (1 kW) సిస్టమ్: దీనికి ప్రభుత్వం రూ. 30,000 సబ్సిడీ ఇస్తుంది. (చిన్న ఇళ్లకు సరిపోతుంది).
  • 2 కిలోవాట్లు (2 kW) సిస్టమ్: దీనికి ప్రభుత్వం రూ. 60,000 సబ్సిడీ ఇస్తుంది.
  • 3 కిలోవాట్లు లేదా అంతకంటే ఎక్కువ (3 kW+): దీనికి గరిష్టంగా రూ. 78,000 పూర్తి సబ్సిడీ లభిస్తుంది. (సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు 3kW సిస్టమ్ పర్ఫెక్ట్‌గా సరిపోతుంది).

💳 డబ్బులు లేకపోతే 'సోలార్ లోన్' (Solar Loan) సదుపాయం:

ఇంటిపై సోలార్ ప్యానెల్స్ పెట్టడానికి ప్రారంభంలో కొంత ఖర్చు అవుతుంది. ఒకవేళ మీ దగ్గర ఒకేసారి అంత డబ్బు లేకపోతే, కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా చాలా తక్కువ వడ్డీకే ఈజీ సోలార్ లోన్స్ (Collateral-Free Loans) ఇప్పిస్తోంది:

  • లోన్ ఇచ్చే బ్యాంకులు: SBI, Canara Bank, HDFC, PNB మరియు ఇతర ప్రముఖ బ్యాంకులు ఈ లోన్ ఇస్తున్నాయి.
  • తక్కువ వడ్డీ రేటు: సాధారణ పర్సనల్ లోన్ల కంటే చాలా తక్కువగా, కేవలం 7% నుండి 7.5% శాతానికే ఈ రుణాలు లభిస్తాయి.
  • తాకట్టు అవసరం లేదు: రూ. 3 లక్షల వరకు తీసుకునే సోలార్ లోన్లకు ఎలాంటి ఆస్తులు తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు.

గమనిక: స్నేహితులారా మా ప్రియమైన రీడర్స్ మీరు చదివి వెళ్ళిపోకుండా మీ స్నేహితుల్లో మీలో ఎవరికి ఏ అర్హత ఉందో చెక్ చేసుకొని తప్పకుండా ఈ పథకాన్ని ఉపయోగించుకుందాం. దేశ అభివ్రుద్ది కి తోడ్పడుదాం. 

గమనిక: బ్యాంకుల నుండి ఎలాంటి లోన్ పొందాలన్నా మీ సిబిల్ స్కోర్ బాగుండటం చాలా ముఖ్యం. మీ స్కోర్ ఎలా పెంచుకోవాలో ఇక్కడ క్లిక్ చేసి మా పాత CIBIL Score పూర్తి గైడ్ ఆర్టికల్ చదవండి. https://www.teluguloanguide.com/2026/09/cibil-score-meaning-in-telugu.html


📋 పథకానికి కావలసిన అర్హతలు మరియు పత్రాలు:

  1. దరఖాస్తుదారు ఖచ్చితంగా భారతీయ పౌరుడై ఉండాలి.
  2. సొంత ఇల్లు ఉండి, సోలార్ ప్యానెల్స్ పెట్టడానికి కావలసినంత స్థలం పైకప్పు (Rooftop) పై ఉండాలి.
  3. మీ పేరు మీద యాక్టివblankగా ఉన్న Electricity Connection (కరెంట్ బిల్) ఉండాలి.
  4. కావలసిన పత్రాలు: ఆధార్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం (Caste Certificate - SC/ST/BC ల కోసం), గత ఆరు నెలల కరెంట్ బిల్లు, బ్యాంక్ పాస్‌బుక్ మరియు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో.

🛠️ ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి? (Step-by-Step):

1. మొదట కేంద్ర ప్రభుత్వ అధికారిక సోలార్ పోర్టల్ www.pmsuryaghar.gov.in ఓపెన్ చేయండి.

2. హోమ్ పేజీలో ఉన్న "Apply for Rooftop Solar" ఆప్షన్ పై క్లిక్ చేయండి.

3. మీ రాష్ట్రం (Andhra Pradesh), మీ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (APSPDCL / APCPDCL / APEPDCL) పేరు ఎంచుకొని, మీ కరెంట్ బిల్ నెంబర్ మరియు మొబైల్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకోండి.

4. లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫారమ్‌లో మీ వివరాలు నింపి, మీ కరెంట్ బిల్లు, కుల ధృవీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయండి.

5. మీ అప్లికేషన్‌ను విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించి అనుమతి (Approval) ఇస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం గుర్తించిన రిజిస్టర్డ్ వెండార్ ద్వారా మీ ఇంటిపై సోలార్ ప్యానెల్స్ అమర్చుకోవచ్చు. సబ్సిడీ డబ్బులు నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి.


గమనిక: ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ప్రభుత్వ లోన్ పథకాలు, ఉచిత సబ్సిడీలు, పర్సనల్ లోన్స్ మరియు బ్యాంకింగ్ అప్‌డేట్స్ కోసం మా Telugu Loan Guide  www.teluguloanguide.com    వెబ్‌సైట్‌ను ఫాలో అవుతూ ఉండండి. ఈ ఉపయోగకరమైన సమాచారాన్ని ఇప్పుడే మీ వాట్సాప్ గ్రూపుల్లోని మిత్రులందరికీ, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులకు షేర్ చేయండి!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది